హెచ్ఎండీఏ పరిధిలోనే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జాం సెంటర్లు

హెచ్ఎండీఏ పరిధిలోనే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జాం సెంటర్లు
  • పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసిన టీఎస్​పీఎస్సీ

హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 మెయిన్ ఎగ్జామ్స్ తేదీలు ఖరారు అయ్యాయి. జూన్ 5 నుంచి12 వరకూ ఏడు రోజుల పాటు పరీక్షలుంటాయని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. 11వ తేదీన ఆదివారం మినహా ప్రతిరోజూ ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం1 వరకూ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 503 పోస్టుల భర్తీ కోసం గతేడాది ఏప్రిల్ 26న టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థుల నుంచి 3.80 లక్షల దరఖాస్తులు రాగా, అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్షకు 2.85 లక్షల మంది అటెండ్ అయ్యారు. డిసెంబర్​లో పికప్ లిస్టు వచ్చింది.

దీంట్లో ఇటీవలే 1:50 రేషియోలో 20,050 మందిని మెయిన్​కు ఎంపిక చేశారు. వీరికి జూన్​ 5 నుంచి మెయిన్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు తాజాగా ప్రకటించింది. పరీక్షా కేంద్రాలన్నీ హైదరాబాద్ చుట్టు పక్కల ఏరియాల్లోనే ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఎగ్జామ్​ను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో రాయొచ్చని పేర్కొంది. అయితే జనరల్ ఇంగ్లిష్ టెన్త్ స్టాండర్డ్​లో ఉంటుందని, ఈ ఎగ్జామ్ అందరూ ఇంగ్లిష్​లోనే రాయాల్సి ఉంటుందని తెలిపింది. ఇంగ్లిష్​లో క్వాలిఫై అయితే సరిపోతుందని, మిగిలిన వాటిలో మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. 

పరీక్షల షెడ్యూల్ ఇదీ..