TSPSC కీలక ప్రకటన.. గ్రూప్–4 అభ్యర్థులకు ఇదే చివరి అవకాశం

TSPSC కీలక ప్రకటన.. గ్రూప్–4 అభ్యర్థులకు ఇదే చివరి అవకాశం

టీఎస్పీఎస్సీ గ్రూప్–4 పరీక్షకు సంబంధించిన తాజా ప్రకటన చేసింది. గ్రూప్–4 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ లో తప్పులను సవరించుకునేందుకు అవకాశం కల్పించింది టీఎస్పీఎస్సీ (TSPSC). మే 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ కి అవకాశం ఇచ్చినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది.

అభ్యర్థులు దరఖాస్తులోని తప్పులను సమరించుకునేందుకు ఇదే చివరి అవకాశం.. పూర్తి వివరాల కోసం టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇక జూలై 1వ తేదీన గ్రూప్–4 పరీక్ష నిర్వహిస్తామని గంతంలోనే టీఎస్పీఎస్సీ షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. 8039 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు 9 లక్షల మంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.