జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం.. జీఎస్టీ రిటర్న్ కు మినహాయింపు ఇచ్చే అవకాశం!

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం.. జీఎస్టీ రిటర్న్ కు మినహాయింపు ఇచ్చే అవకాశం!

మూడు నెలల లాక్డౌన్ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో ఈ రోజు 40వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులతో నిర్మలా సీతారామన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడనున్నారు. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తర్వాత తొలిసారి జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం నిర్వహిస్తున్నారు. పన్ను ఆదాయాలపై కోవిడ్‌-19 ప్రభావం గురించి చర్చించనున్నారు. కేంద్ర, రాష్ట్రాల ఆదాయాలపై కరోన మహమ్మారి ప్రభావంతో పాటు.. ఆదాయాలను పెంచుకునే మార్గాలపై కౌన్సిల్‌ లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లింపులపై నూతన మార్గదర్శకాల గురించి కూడా చర్చించే అవకాశముంది. కరోనా ప్రభావం నేపథ్యంలో… జీఎస్టీ రిటర్న్ దాఖలుకు మినహాయింపు ఇవ్వడం లేదా ఆలస్య రుసుం లేకుండా వసూల్ చేసే అంశాలపై నిర్ణయం తీసుకునున్నట్లు తెలుస్తోంది.

For More News..

కరోనాతో రాత్రంతా కర్ఫ్యూ.. రెచ్చిపోతున్న దొంగలు

కేటీఆర్ వీడియో షేర్ చేసిన రేవంత్ రెడ్డి

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్