జీఎస్టీ తగ్గింపు దేశానికి కానుక: ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్

జీఎస్టీ తగ్గింపు దేశానికి కానుక: ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్

ముషీరాబాద్, వెలుగు: జీఎస్టీ తగ్గింపు దేశానికి ప్రధాని మోదీ అందజేసిన చరిత్రాత్మక కానుక అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. జీఎస్టీ తగ్గింపుపై మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ సోమవారం చిక్కడపల్లి నుంచి గాంధీనగర్ వరకు పాదయాత్ర చేపట్టారు.  భరత్ గౌడ్, డీఎస్ రెడ్డి, మద్దూరి శివాజీ, కార్పొరేటర్లు సుప్రియ పాల్గొన్నారు.

వికారాబాద్: కేంద్రం తగ్గించిన జీఎస్​టీతో సామాన్య ప్రజలకు మేలు జరుగనుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.  సోమవారం వికారాబాద్​ ఆర్​అండ్​బీ గెస్ట్​హౌజ్​లో ఆయన మాట్లాడారు.  జీఎస్టీ  తగ్గింపుతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.  జిల్లా జీఎస్టీ కన్వీనర్ వెన్న ఈశ్వరప్ప, బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి, శివరాజ్, రమేశ్​కుమార్, దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు పాల్గొన్నారు.