జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు... ఏప్రిల్ లో ఖజానాకు రూ.2.43 లక్షల కోట్లు

జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు... ఏప్రిల్ లో ఖజానాకు రూ.2.43 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: జీఎస్​టీ వసూళ్ల విలువ గత నెల రూ.2.43 లక్షల కోట్లకు చేరి సరికొత్త రికార్డును సృష్టించింది. గత ఏప్రిల్​లో వసూలైన రూ.2.23 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 8.7 శాతం ఎక్కువ. దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం పెరగడం వల్ల ఈ భారీ వసూళ్లు సాధ్యమయ్యాయి. దేశీయ లావాదేవీల ఆదాయం 4.3 శాతం పెరిగి రూ.1.85 లక్షల కోట్లు దాటింది. దిగుమతులపై జీఎస్​టీ వసూళ్లు 25.8 శాతం వృద్ధి చెంది రూ.57,580 కోట్లకు చేరాయి. 

ఈసారి కేంద్ర వస్తు సేవల పన్ను (సీజీఎస్​టీ) వసూళ్లు రూ.52,140 కోట్లుగా ఉన్నాయి. రాష్ట్ర వస్తు సేవల పన్ను (ఎస్​జీఎస్​టీ) వసూళ్లు రూ.61,331 కోట్లుగా నమోదయ్యాయి. 

సమగ్ర వస్తు సేవల పన్ను (ఐజీఎస్​టీ) కింద రూ.1.29 లక్షల కోట్లు వచ్చాయి. పన్ను రీఫండ్‌‌లు 19.3 శాతం పెరిగి రూ.31,793 కోట్లకు చేరాయి. రీఫండ్‌‌లను సర్దుబాటు చేసిన తర్వాత నికర జీఎస్​టీ వసూళ్లు 7.3 శాతం వృద్ధితో రూ.2.11 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.