గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బతుకమ్మ సంబురాలు వాయిదా

 గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బతుకమ్మ సంబురాలు వాయిదా

హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో సెప్టెంబర్ 28న నిర్వహించ తలపెట్టిన వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డ్ బతుకమ్మ ఈవెంట్  వాయిదా వేసినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ తెలిపింది. మరుసటి రోజు (ఈ నెల 29న) ఈ వేడుకను సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. ఈ అతిపెద్ద బతుకమ్మ ఉత్సవానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరవుతారని చెప్పిన పర్యాటక శాఖ.. వరుసగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ఎల్బీ స్టేడియం నుంచి సరూర్ నగర్ స్టేడియానికి మార్చినట్లు  తెలిపింది.

ఈ సారి బతుకమ్మ ఉత్సవాలను గిన్నిస్ బుక్ రికార్డు లక్ష్యంగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లోని  ఎల్బీ స్టేడియంలో 11 వేల మంది స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలతో బతుకమ్మ ఉత్సవాలను సెప్టెంబర్ 28న నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ అర్బన్ కమ్యూనిటీ డెవలప్ మెంట్ విభాగం ఏర్పాట్లు  చేస్తోంది.  అయితే వాతావరణ శాఖ హెచ్చరికతో 29న సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.