గుజరాత్ హ్యాట్రిక్.. 4 వికెట్ల తేడాతో పంజాబ్‎పై విక్టరీ

గుజరాత్ హ్యాట్రిక్.. 4 వికెట్ల తేడాతో పంజాబ్‎పై విక్టరీ

అహ్మదాబాద్: ఐపీఎల్​19లో భాగంగా ఆదివారం పంజాబ్​కింగ్స్, గుజరాత్​టైటాన్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్​హ్యాట్రిక్​విజయం సాధించింది. పంజాబ్​నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని (19.5) ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్​ఓడి మొదట బ్యాటింగ్​చేపట్టిన పంజాబ్‎కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సిరాజ్​వేసిన మొదటి ఓవర్​లోనే ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కానోలీ అవుట్ అయ్యారు. దీంతో సూర్యాన్ష్ షెడ్జ్ (​29  బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్​లతో 57), మార్కస్ స్టోయినిస్ (​ 31బంతుల్లో 5ఫోర్లు,1 సిక్స్ తో40 ) పరుగులతో రాణించారు. 

చివర్లో మార్కో జాన్సెన్​బ్యాట్​ఝులిపించడంతో పంజాబ్​ఆ స్కోరైనా చేయగలిగింది. సిరాజ్ (2/28), హోల్డర్ (4/24) , రబడ 2/22 పోటీపడి వికెట్లు తీశారు. అనంతరం ఛేజింగ్​కు దిగిన గుజరాత్​సాయి సుదర్శన్ (41 బంతుల్లో 5 ఫోర్లు,1 సిక్స్​తో 57), వాషింగ్టన్​సుందర్ ( 23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్​తో 40) పరుగులతో చెలరేగారు. హోల్డర్‎కు 'మ్యాన్​ఆఫ్​ద ప్లేయర్'​ దక్కింది.

కుప్పకూలిన పంజాబ్ ​టాప్ ఆర్డర్

సిరాజ్, హోల్డర్ ధాటికి పంజాబ్ 8.4 ఓవర్లలో 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో సూర్యాన్ష్ షెడ్జ్ (29 బంతుల్లో 57), మార్కస్ స్టోయినిస్ (40) ఆరో వికెట్‌కు 79 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. షెడ్జ్ గుజరాత్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ అవకాశం దొరికినప్పుడల్లా బ్యాట్ ఝులిపించాడు. మానవ్ సుతార్ వేసిన 14వ ఓవర్‎లో వరుసగా 6, 6, 4, 4, 6 బాది మొత్తం 26 పరుగులు రాబట్టాడు. 

కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ  వెంటనే రబడ (2/22) బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం హోల్డర్ రంగంలోకి దిగి నెహాల్ వధేరా, పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను పెవిలియన్ పంపాడు. వధేరా వికెట్ కీపర్‌కు దొరికిపోగా, శ్రేయస్ అయ్యర్ బంతిని థర్డ్ మ్యాన్ దిశగా మళ్లించే క్రమంలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివరకు పంజాబ్​20 ఓవరల్లో 9 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.

చివరి బంతి వరకు ఉత్కంఠ..

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ తొలి ఓవర్‎లోనే 12 పరుగులు రాబట్టింది. జట్టు స్కోరు 16 పరుగుల వద్ద కెప్టెన్​శుభమన్​గిల్​అర్షదీప్​బౌలింగ్‎లో కనోలికి క్యాచ్​ఇచ్చి అవుట్​అయ్యాడు. క్రీజులోకి వచ్చిన జోస్​బట్లర్​మరో ఓపెనర్​సాయి సుదర్శన్‎తో జత కట్టాడు. వీరిద్దరూ కలిసి 40 బంతుల్లో 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం బట్లర్​(22 బంతుల్లో 1ఫోర్​, 2 సిక్స్​లతో 26) విజయ్​వైశాఖ్​ బౌలింగ్‎లో  శ్రేయస్‎కు క్యాచ్​ఇచ్చి వెనుదిరిగాడు. 

10 ఓవర్లకు గుజరాత్​2 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. 11 ఓవర్​లో నిశాంత్​సింధు (15) స్టోయినిస్​బౌలింగ్​లో క్యాచ్​అవుట్​అయ్యాడు. ఈ క్రమంలో సాయి సుదర్శన్​37 బంతుల్లో హాఫ్​సెంచరీ పూర్తి చేశాడు. 14 ఓవర్​లో సుదర్శన్ (41 బంతుల్లో 5 ఫోర్లు,1 సిక్స్​తో 57) విజయ్​ బౌలింగ్​లో బార్ట్​లెట్​కు చిక్కాడు. విజయానికి చివరి ఓవర్​లో 11 పరుగులు రాబట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో వాషింగ్టన్​సుందర్​( 23 బంతుల్లో 40 ) ఐదో బంతిని సిక్స్​గా మలిచి విజయాన్ని ఖాయం చేశాడు. 

సంక్షిప్త స్కోర్లు: 

పంజాబ్​కింగ్స్ : 20 ఓవర్లలో 163/9 (షెడ్జ్​57, ​స్టోయినిస్​40, జాసన్​హోల్డర్​4/24.

గుజరాత్​ టైటాన్స్ :  19.1 ఓవర్లలో 167/ 6 ( సుదర్శన్ 57,  సుందర్ 40, అర్ష్​దీప్​సింగ్​2/24