RRvsGT: ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ (GT) నెక్స్ట్ లెవెల్ ఆటతోని ఫైనల్‌కు దూసుకెళ్లింది. ముల్లాన్‌పూర్ స్టేడియం సాక్షిగా జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో రాజస్థాన్ రాయల్స్ ఇచ్చిన 215 పరుగుల భారీ టార్గెట్‌ను గుజరాత్ ప్లేయర్స్ దంచికొట్టారు. ఈ సూపర్ హిట్ గెలుపుతోని మే 31వ తేదీన జరగబోయే గ్రాండ్ ఫినాలేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో గుజరాత్ అమీతుమీ తేల్చుకోనుంది.
గుజరాత్ ఓపెనర్ల రాంపేజ్:
215 రన్స్ కొట్టాలనే ప్రెజర్‌తోని క్రీజులోకి వచ్చిన గుజరాత్ ఓపెనర్లు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ మ్యాచ్‌ను కంప్లీట్‌గా వన్-సైడ్ చేసేశారు. రాజస్థాన్ బౌలర్లను అస్సలు లెక్కచేయకుండా గట్టిగ ఎదురుదాడికి దిగారు. వీరిద్దరి మధ్య నెలకొన్న 167 పరుగుల భారీ ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్‌తో మ్యాచ్ మొత్తం గుజరాత్ చేతుల్లోకి వచ్చేసింది. అయితే, బ్రిజేష్ శర్మ వేసిన 12.5 ఓవర్ల కిరాక్ గా బ్యాటింగ్ చేస్తున్న సాయి సుదర్శన్ ఊహించని విధంగా 'హిట్ వికెట్' అయిండు. దీంతో 167 రన్స్ దగ్గర గుజరాత్ ఫస్ట్ వికెట్ కోల్పోయింది.
గిల్ సెంచరీ.. రాజస్థాన్ బౌలర్లపై ఒత్తిడి:
ఒకవైపు సుదర్శన్ అవుట్ అయినా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాత్రం రాజస్థాన్ బౌలర్లకు అస్సలు అవకాశం ఇయ్యలేదు. బంతి కనిపిస్తే బౌండరీ అవతలికి పంపడమే టార్గెట్‌గా పెట్టుకున్న గిల్.. ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేసి ముల్లాన్‌పూర్ స్టేడియాన్ని హోరెత్తించిండు. గిల్ ఆడిన ఇన్నింగ్స్ చూసి ఆర్‌ఆర్ బౌలర్లు పూర్తిగా ఒత్తిడిలోకి వెళ్లిపోయారు. జట్టును గెలుపు అంచుల్లో నిలిపిన తర్వాత, 15వ ఓవర్ల జోఫ్రా ఆర్చర్ వేసిన బంతికి గిల్ ఎల్బీడబ్ల్యూ (LBW)గా అవుట్ అయి పెవిలియన్ చేరిండు. గిల్ మైదానం వీడుతున్నప్పుడు ఫ్యాన్స్ అంతా లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తూ గట్టిగ అరిచారు.
ఆర్‌సీబీతోనే ఫైనల్ ఫైట్:
గిల్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్ మ్యాచ్ ని పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుని దూకుడుగా ఆడాలని ప్రయత్నించినప్పటికీ, 201 పరుగుల దగ్గర సుందర్ నాండ్రే బర్గర్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా, బట్లర్ చాలా కూల్‌గా మ్యాచ్‌ను ఫినిష్ చేయడంతో.. రాజస్థాన్‌పై ఘన విజయం సాధించి రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ కి దూసుకెళ్లింది.
క్వాలిఫైయర్ 1లో ఆర్‌సీబీ చేతిలో దారుణంగా ఓడిపోయిన గుజరాత్.. ఇప్పుడు అదే ఆర్‌సీబీని ఫైనల్లో ఢీకొట్టేందుకు "రివెంజ్ మోడ్" లో రెడీ అయింది. మరి మే 31న (ఆదివారం) జరగబోయే ఫైనల్ పోరులో ఆర్‌సీబీ "బ్యాక్-టు-బ్యాక్" కప్పు కొడుతుందో.. లేక శుభ్‌మన్ గిల్ ఆర్మీ టైటిల్ ఎగరేసుకుపోతుందో చూడాలి మరీ.
A knock to salute 🫡
— IndianPremierLeague (@IPL) May 29, 2026
A trademark celebration to frame 🖼️
Updates ▶️ https://t.co/eupS8cBPc2#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR | @gujarat_titans pic.twitter.com/noseNMmrib
