టాస్ గెలిచిన గుజరాత్.. ఫైనల్ బెర్త్ కోసం బరిలోకి దిగిన ఆర్సీబీ

టాస్ గెలిచిన గుజరాత్.. ఫైనల్ బెర్త్ కోసం బరిలోకి దిగిన ఆర్సీబీ

RCB vs GT: ధర్మశాల వేదికగా ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్-1 పోరు షురువైంది. గీ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకుంది. అంటే.. కింగ్ విరాట్ కోహ్లి సేన బెంగళూరు (RCB) ఫస్ట్ బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి టీమ్ ముందు భారీ టార్గెట్ సెట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆర్సీబీని తక్కువ పరుగులకే కట్టడి చేయాలని గిల్ సైన్యం ప్లాన్ చేయడంతోనే ఫస్ట్ ఫిల్డింగ్ తీసుకుంది. 

గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. ధర్మశాల పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. కానీ ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచు (Dew) ప్రభావం చానా ఎక్కువగా ఉంటది.. అందుకే చేజింగ్ చేయడం సేఫ్ అని ఫీల్డింగ్ తీసుకున్నాం.. ఈ గ్రౌండ్‌లో నేను అండర్-14, అండర్-16 రోజుల్లో చాలా మ్యాచ్‌లు ఆడాను, కాబట్టి ఆ అనుభవం ఇవాళ యూజ్ అవుతది అని చెప్పిండు. గుజరాత్ టీమ్‌లో ఒక చేంజ్ జరిగింది.. అర్షద్ ఖాన్ ప్లేస్‌లోకి కుల్వంత్ ఖేజ్రోలియా ఎంట్రీ ఇచ్చాడు. 

ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. మేము మ్యాచ్ బై మ్యాచ్ ప్లాన్ చేసుకుంటూ మా బలాలు నమ్ముకుని గ్రౌండ్‌లోకి దిగుతున్నాం.. ఫస్ట్ బ్యాటింగ్ చేయడం కూడా మంచిదే.. బోర్డుపై భారీ స్కోరు పెట్టడానికి ట్రై చేస్తామని తెలిపాడు. పాత జట్టుతోనే బరిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నాడు. 

ఇరు జట్లు: 

గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కుల్వంత్ ఖేజ్రోలియా, కాగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జేకబ్ డఫీ, జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ సలామ్ దార్.