IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్.. పంజాబ్‎దే ఫస్ట్ బ్యాటింగ్

IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్.. పంజాబ్‎దే ఫస్ట్ బ్యాటింగ్

గాంధీనగర్: ఐపీఎల్ 19లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్‎ను గుజరాత్ టైటాన్స్ ఢీకొట్టనుంది. ఆదివారం (మే 3) రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్‎లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచింది. దీంతో జీటీ కెప్టెన్ శుభమన్ గిల్ బౌలింగ్ ఎంచుకుని పంజాబ్ ను తొలుత బ్యాటింగ్‎కు ఆహ్వానించాడు. 

ఇరు జట్లు పలు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. చివరి మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీని ఓడగొట్టిన జోష్‎లో గుజరాత్ బరిలోకి దిగగా.. రాజస్థాన్ చేతిలో ఓటమి పాలైన పంజాబ్ ఈ మ్యాచులో గెలిచి తిరిగి విజయాల బాటపట్టాలని భావిస్తోంది. 

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (w), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (సి), మార్కస్ స్టోయినిస్, సూర్యాంశ్ షెడ్జ్, నెహాల్ వధేరా, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):

శుభమన్ గిల్(సి), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, మానవ్ సుతార్