కెనడా లో గుజరాతీ యువతి దారుణ హత్య

కెనడా లో గుజరాతీ యువతి దారుణ హత్య

టొరంటో: కెనడాలో గుజరాతీ యువతి దారుణ హత్యకు గురైంది. నయాగరా రీజియన్‌‌లో ఒక దుండగుడు ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. గుజరాత్‌‌లోని ఆనంద్ జిల్లా బోర్సాద్‌‌కు చెందిన విధి మేఘాని (22) నాలుగేండ్లుగా కెనడాలో ఉంటోంది. ఉన్నత విద్యను అభ్యసిస్తూ.. పార్ట్‌‌టైమ్ ఉద్యోగం చేస్తోంది. ఒక దుండగుడు మే 15న కత్తితో పొడవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. 

అయితే, మేఘానిపై దాడి చేయడానికి గల కారణాలు, నిందితుడి ఉద్దేశం తెలియడం లేదని పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామన్నారు. కాగా, మేఘాని మరణవార్త తెలియగానే గుజరాత్‌‌లోని ఆమె స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.