కోనరావుపేట, వెలుగు: కువైట్లో గుండెపోటుతో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన మారుపాక నర్సయ్య(55) చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన నర్సయ్య 15 ఏండ్లుగా ఉపాధి కోసం కువైట్ వెళ్తున్నాడు. ఏడాది కింద ఇంటికి వచ్చి వెళ్లిన నర్సయ్య.. ఈసారి వచ్చి ఇక్కడే ఉంటానని చెప్పాడు.
కొద్ది రోజుల్లో ఇంటికి వస్తాడని అనుకుంటుండగా, ఆదివారం మధ్యాహ్నం కువైట్లో తాను ఉంటున్న గదిలో గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. నర్సయ్యకు భార్య పద్మ, కూతురు భవాని, కొడుకు దత్తు ఉన్నారు.
