పెద్దపల్లి జిల్లాలో మక్క రైతులకు బార్దాన్ కష్టాలు

పెద్దపల్లి జిల్లాలో మక్క రైతులకు బార్దాన్ కష్టాలు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో మక్కజొన్న రైతులకు బార్దాన్​ కష్టాలు నెలకొన్నాయి. గన్నీ బ్యాగులు సొంతంగా తెచ్చుకుంటే తొందరగా కొంటామని, అలా తెచ్చుకున్న ప్రతి బస్తాకు రూ.21 చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా బయట ఒక్కో బస్తాకు రూ.30 నుంచి రూ.35 వరకు అమ్ముతున్నారు. దీంతో రైతు క్వింటాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సుమారు రూ. 20కి పైగా నష్టపోతున్నారు. 25 రోజులుగా రైతులు ఆయా మార్కెట్లకు మక్కలను తీసుకొస్తున్నారు. కొనుగోళ్లు మాత్రం మందకొడిగా సాగుతున్నాయి. 

మార్కెట్​ నిర్వాహకులు మాత్రం బార్ధాన్, హమాలీలు, లారీలు కొరత వల్లే కొనుగోళ్లు ఆలస్యమవుతున్నట్లు చెప్తున్నారు.  ఒకవైపు కాలం దగ్గర పడుతుండగా అధికారులు కొనుగోళ్లపై తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర గందరగోళానికి దారితీస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాకు మక్కల కొనుగోళ్లకు 4 లక్షల బ్యాగులు అవసరం కాగా ఇప్పటివరకు లక్ష వరకే సప్లయ్ చేసినట్లు తెలుస్తోంది.