కేసీఆర్, నేను అనుకున్నంత కాలం పదవిలో ఉంటా: గుత్తా సుఖేందర్​రెడ్డి

కేసీఆర్, నేను అనుకున్నంత కాలం పదవిలో ఉంటా: గుత్తా సుఖేందర్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ అనుకున్నంత వరకు లేదంటే తాను అనుకున్నంత కాలం పదవిలో ఉంటానని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కౌన్సిల్‌లోని తన చాంబర్‌‌లో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. 

బీఆర్ఎస్‌కు కమ్యూనిస్టులు మిత్రపక్షంగా ఉంటేనే మంచిదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు. కమ్యూనిస్టుల గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదని, తాను గౌరవప్రదమైన స్థానంలో ఉన్నానన్నారు. తన కొడుకుకు అవకాశం వస్తేనే పోటీ చేస్తాడని, పార్టీ చీఫ్ కేసీఆర్ మొత్తం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో ప్రస్తుతానికి అవకాశాలు లేవని పేర్కొన్నారు.