గుదిబండి వెంకట్రెడ్డి కన్నుమూత

గుదిబండి వెంకట్రెడ్డి కన్నుమూత

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రముఖ సాంస్కృతిక సంస్థ జీవీఆర్ ఆరాధన నిర్వాహకులు గుదిబండి వెంకటరెడ్డి (84)  కన్నుమూశారు. ఆదివారం రాత్రి గుంటూరు నుంచి హైదరాబాద్ కు బస్సులో వస్తుండగా జరిగిన ప్రమాదంలో చనిపోయారు. నార్కట్ పల్లి దగ్గర తెల్లవారుజామున 4 గంటలకు బస్సును వెనక నుంచి డీసీఎం ఢీ కొట్టడంతో వెనుక సీట్లో కూర్చున్న వెంకట రెడ్డి తలకు బలమైన గాయమైంది. దీంతో ఆయనను దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు.