
బర్గర్ నుంచి బిర్యానీ వరకు.. రుచిగా ఉంటే చాలు ఎంత దూరం వెళ్లైనా తినొచ్చు అనిపిస్తుంది. ఆ ఫుడ్ లిస్ట్‌లో చైనీస్ వంటలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కాస్త లోకల్ ఫ్లేవర్ జత చేసి ఇండో – చైనీస్ రుచులు వడ్డిస్తే.. మైమరిచి తినడం ఖాయం. అలాంటి ఫుడ్‌నే అందిస్తోంది దశాబ్దాల నాటి చరిత్ర ఉన్న ఈ హాయ్కింగ్ రెస్టారెంట్. ఐదు దశాబ్దాలుగా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న ఈ రెస్టారెంట్‌కి ఇప్పటికీ మూడు చోట్ల మాత్రమే అవుట్లెట్లు ఉన్నాయంటే నమ్ముతారా? పైగా యాంటిక్ లుక్‌తో, అథెంటిక్ ఫుడ్‌తో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది.
హైదరాబాద్‌లోని ఫేమస్ ఇండో– చైనీస్ రెస్టారెంట్.. అనగానే గుర్తొచ్చే పేరు హాయ్కింగ్. హిమయత్ నగర్లో ఉన్న ఈ లెజండరీ రెస్టారెంట్ 53 ఏండ్లుగా బెస్ట్ టేస్టీ ఫుడ్‌ని అందిస్తోంది.1972లో మొదలైన ఈ రెస్టారెంట్ ప్రస్థానం నేటికీ కొనసాగుతోంది. నిజానికి హాయ్కింగ్ రెస్టారెంట్‌ని బిజినెస్ డ్రీమ్లాగ మొదలుపెట్టలేదు. ‘‘మా తల్లిదండ్రులకు మా మీద ఉన్న ప్రేమ, మా భవిష్యత్తు గురించి ఆలోచనల నుంచి పుట్టింది. మాకు నమ్మకమైన కస్టమర్లు ఉండడం వల్లనే మేం ఇంకా ఇక్కడ ఉన్నాం. ఇన్నేళ్లుగా హాయ్కింగ్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’’ అంటున్నాడు ఈ రెస్టారెంట్ ఓనర్.
ఆదాయ మార్గంగా..
చైనాకు చెందిన అఫో, అకుంగ్ అనే దంపతులు హైదరాబాద్‌లో నివాసం ఉండేవాళ్లు. తమ పిల్లల్ని హైదరాబాద్‌లోనే మంచి స్కూల్లో చదివించాలి అనుకున్నారు. అందుకోసం డబ్బు ఖర్చు అవుతుందని సంపాదన కోసం1972లో ఈ రెస్టారెంట్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత1980లో రెస్టారెంట్ చూసుకోవడానికి వాళ్ల కొడుకు బిజినెస్‌లోకి వచ్చాడు. అతనే ఇప్పడు ఓనర్. ‘‘ప్రతి వారం మేం మంచి ఫుడ్ తినాలనే ఆశతో ఇంటికి వచ్చేవాళ్లం. మా అమ్మ చేతి వంట చాలా బాగుంటుంది. ఈ రెస్టారెంట్లో కూడా అలానే ఉంటాయి. ఈరోజు అదే అమ్మ ప్రేమను ప్రతి డిష్ ద్వారా కస్టమర్లకు అందిస్తున్నాం. 50 ఏండ్లకు పైగా సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ అవుతోంది. హాయ్కింగ్ సక్సెస్‌కి కారణం కస్టమర్లే” అంటాడు ఓనర్. ఇప్పుడు హాయ్కింగ్కి సిటీకి దగ్గరలో మూడు బ్రాంచ్‌లు ఉన్నాయి. మొదటి బ్రాంచ్ హిమయత్ నగర్‌లోని యూనివర్సిటీ రోడ్లో ఉంది. రెండోది జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెం 46లో ఉంది. మూడో బ్రాంచ్ టెక్, కార్పొరేట్ వాళ్లు ఎక్కువగా ఉండే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉంది. ప్రతి బ్రాంచ్‌లో ఒకేలాంటి ఫ్లేవర్లు, సర్వీస్ అందించడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత.
యువతకు నచ్చే క్విజీన్..
చైనీస్ క్విజీన్, హైదరాబాద్‌లో యువత ఎక్కువగా ఇష్టపడుతుంటారు. స్పైసీ నూడిల్స్, ఫ్రైడ్ రైస్ వంటివి ఎక్కువగా తింటారు. వాటితోపాటు హైదరాబాదీలకు నచ్చే చైనీస్ ఫుడ్ వెరైటీలు హాయ్కింగ్లో దొరుకుతాయి. అథెంటిక్ చైనీస్ ఫుడ్‌తోపాటు లోకల్ ఫ్లేవర్లతో కలిపి తయారుచేస్తారు కాబట్టి ఇండియన్స్‌కి తెగ నచ్చేస్తుంది. హాయ్కింగ్ మెనూలో ఎప్పుడూ ఫుడ్ ఫ్రెష్‌గా ఉంటుంది.
ట్రెడిషనల్ చైనీస్ టెక్నిక్స్‌తో వండిన ఫుడ్ హైదరాబాద్ వాసులకు నచ్చుతుంది. హాయ్కింగ్కి వెళ్తే తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్‌లు ఏవీ అంటే.. చికెన్ కార్న్ సూప్... క్రీమీ, ఫ్లేవర్ఫుల్తో ఉండే ఈ డిష్ మాన్సూన్లో మనసు దోచేస్తుంది. చిల్లీ ప్రాన్స్.. స్పైసీగా.. క్రిస్పీగా ఉండే ఈ డిష్ టేస్ట్‌లో సూపర్బ్! ఇక బ్యాంబూ చికెన్ రైస్ అయితే ప్రత్యేకమైన రుచితో మంచి ఫీల్ ఇస్తుంది. ఇంకా క్రిస్పీ థ్రెడ్ చికెన్, గార్లిక్ జింజర్ చికెన్, చికెన్ పకోడీ, చైనీస్ చాప్ స్యూ, మంచూరియన్ బాల్స్.. ఇలా ఎన్నో వెరైటీలు ఉన్నాయి.
అందుబాటు ధరల్లో..
కంప్లీట్ మీల్ అంటే రెండు స్టార్టర్స్, సూప్, మెయిన్ కోర్స్‌తోపాటు డ్రింక్స్ కూడా కలిపి రూ. 800 నుంచి రూ.1000ల్లో అయిపోతుంది. 50 ఏండ్లకు పైగా కలీనరీ హిస్టరీ కలిగిన ఈ రెస్టారెంట్ హైదరాబాద్‌లో అథెంటిక్ చైనీస్ క్విజీన్ అందిస్తోంది. స్థిరమైన టేస్ట్‌తోపాటు అదే ప్రేమతో ఆ ఫ్యామిలీ సర్వీస్ చేస్తోంది. అందుబాటు ధరల్లో నిజాయితీగా అందిస్తుంది. చివరిగా.. హాయ్కింగ్ రెస్టారెంట్ మాత్రమే కాదు.. ఇది హైదరాబాదీ ఫుడ్ లెజెండ్. ఇండో – చైనీస్ ఫుడ్ తినాలనుకుంటే మనస్ఫూర్తిగా టేస్ట్‌ని ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ.
టైం ట్రావెల్ చేసినట్టు..
హిమయత్ నగర్‌లోని హాయ్కింగ్లో అడుగుపెడితే టైం ట్రావెల్ చేసినట్టు ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అంత అద్భుతంగా ఉంటుంది అక్కడి యాంబియెన్స్. సింపుల్ ఇంటీరియర్స్‌తో చూడగానే చాలా ఏళ్లనాటిది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. తలుపులు తెరవగానే గోడలపైన అందమైన మ్యూరల్స్ కళ్లను కట్టిపడేస్తాయి. అది కేవలం డెకరేషన్ మాత్రమే కాదు. ఏసియన్ హెరిటేజ్‌కి ట్రిబ్యూట్ లాంటిది.
ఎప్పటి నుంచో వస్తున్న కస్టమర్లు, ఆ రెస్టారెంట్‌తో తమకు ఉన్న అనుబంధం గురించి చెప్తుంటారు. ‘స్కూల్ డేస్‌లో తిన్న సందర్భాలు.. సండే ఫ్యామిలీ డిన్నర్స్ అక్కడే చేసేవాళ్లం’ అని గుర్తుచేసుకుంటారు. ఇప్పుడు కట్లెరీలో చిన్న చిన్న మార్పులు వచ్చాయి. అది డెకరేషన్‌కి హెల్ప్ అవుతుంది. కానీ, వాటికంటే ఇక్కడ తినే ఫుడ్ టేస్ట్ గురించే చెప్పుకోవాలి. అప్పటికీ ఇప్పటికీ టేస్ట్ ఏమీ మారలేదని పాత కస్టమర్లు రివ్యూ ఇస్తుంటారు. ఆ టేస్ట్ కోసమే రెగ్యులర్‌గా ఇక్కడకి వస్తున్నట్టు వాళ్లు చెప్తుంటారు.