- వృత్తి సంఘాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయి
హైదరాబాద్: చేతి వృత్తులు చితికి పోతున్నాయన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. వృత్తి సంఘాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. వృత్తి సంఘాలు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. బొమ్మగాని ధర్మభిక్షం శత జయంతి సందర్భంగా తెలంగాణ వృత్తి సంఘాల సమైక్య ఆధ్వర్యంలో వృత్తి సంఘాల నిర్మాణం- సామాజిక అభివృద్ధి అనే అంశంపై సదస్సు జరిగింది. వృత్తి సంఘాల కోసం ధర్మ బిక్షం పోరాటం చేశారని.. ఏ వృత్తులకు ఆ సంఘం పెట్టుకుని అభివృద్ధి చేసుకోవాలన్నారు నేతలు.
ఇవి కూడా చదవండి
