అమీర్ పేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్త్ర ప్రదర్శన షురూ.. ప్రత్యేక చేనేత మార్కెటింగ్ ఈ వెంట్ ప్రారంభం

అమీర్ పేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్త్ర ప్రదర్శన షురూ.. ప్రత్యేక చేనేత మార్కెటింగ్ ఈ వెంట్ ప్రారంభం

హైదరాబాద్ సిటీ, వెలుగు: అమీర్​పేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమ్మ సంఘంలో ‘ప్రత్యేక చేనేత మార్కెటింగ్ ఈవెంట్ 2026’ను చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రదర్శన 17వ తేదీ వరకు కొనసాగనుండగా..వివిధ రాష్ట్రాల చేనేత వస్త్రాలను ప్రదర్శనకు ఉంచారు.

ఇందులో యూపీ బనారసి చీరలు, ఏపీ కలంకారి, కాటన్ బుట్టా చీరలు, గుజరాత్ పటోలా చీరలు, మధ్యప్రదేశ్ చందేరి చీరలు, మహారాష్ట్ర పైథాని చీరలు, తెలంగాణ పోచంపల్లి ఇక్కత్, గొల్లభామ చీరలను ప్రదర్శిస్తున్నారు. సందర్శకులకు ఎలాంటి ఫీజు లేదు. ఉదయం 10:30 నుంచి రాత్రి 9:00 గంటల వరకు కొనసాగుతుంది.