హనుమాన్ జయంతి 2026 మే 12 వైశాఖ బహుళ నవమి మంగళవారం .. ఆంజనేయ స్వామికి మంగళవారం చాలా ఇష్టమైన రోజు. . జ్యోతిష్యం ప్రకారం, హనుమంతుడి ఆశీస్సులు కావాలనుకునే వారు హనుమాన్ జయంతి రోజున స్వామిని అర్చించి కొన్ని పదార్దాలను స్వామిని నైవేద్యం సమర్పించి.. పేదలకు వితరణ చేయాలి. అలా చేయడం వలన జీవితంలోని సమస్యల నుంచి ఉపశమనం పొందడంతో పాటు, సకల పాపాల నుంచి విముక్తి పొందుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 2026 మే12 హనుమజ్జయంతి సందర్భంగా 12 రాశుల వారు ఏయే పదార్ధాలను నైవేద్యం సమర్పించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
మేష రాశి: ఈ రాశి వారికి కుజుడు అధిపతి.. హనుమాన్ జయంతి రోజున ఈ రాశి వారు ఆంజనేయ స్వామికి తులసి మాల సమర్పించి .. సింధూరాన్ని సమర్పించాలి. షోడశోపచార పూజ చేసిన తరువాత స్వామికి శనగపిండి లడ్డూలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అంజనా పుత్రుడైన హనుమంతుడు.... సుఖ సంతోషాలను ప్రసాదించి.. కష్టాలను తొలగేలా... స్వామివారు అనుగ్రహిస్తారని పండితులు చెబుతున్నారు
వృషభ రాశి: ఈ రాశికి అధిపతి శుక్రుడు .. హనుమజ్జయంతి రోజున ఈ రాశి వారు స్వామిని అష్టోత్తరంతో పూజించి.. హనుమంతుడికి తులసి ఆకులు లేదా లడ్డూలు నైవేద్యంగా పెట్టి పూజించాలి.ఇలా చేయడం వల్ల హనుమంతుని ఆశీర్వాదం లభించి మీకు అన్ని పనుల్లో విజయం చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
మిథున రాశి: ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశి వారు మే12 హనుమజ్జయంతి రోజున ఆంజనేయప్వామికి ప్రదక్షిణలు చేసి. హనుమాన్ చాలీసా పఠిస్తే చాలా రంగాల్లో అద్భుత విజయాలు సాధించే అవకాశాలను పొందుతారు. అలాగే శనగలు .. బెల్లం కలిపి తయారు చేసిన తీపి పదార్థాలను స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవితం శాంతి, సంతోషాలను స్వామివారు కలుగజేస్తారు.
కర్కాటక రాశి: ఈరాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి వారుహనుమజ్జయంతి రోజున స్వామిని తమలపాకులతో ఆకుపూజ చేయాలి. 108 తమల పాకులతో దండ తయారు స్వామి వారికి సమర్పించాలి. ధూప దీపం తరువాత .. అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వలన ఉద్యోగ సమస్యలు... ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. స్వామిని పూజించేటప్పుడు ఆవు నెయ్యి దీపం సమర్పించాలి.
సింహ రాశి: సూర్యుడు ఈరాశికి అధిపతి.. ఈ రాశివారు హనుజ్జయంతి రోజున ఆంజనేయస్వామికి తులసి మాల .. సింధూరాన్ని సమర్పించాలి. ఆ తరువాత 108 ప్రదక్షిణాలు చేసి.. బెల్లం, శనగలు, పండ్లు సమర్పించాలి. ఇలా చేయడం వలన జీవితంలో ఇప్పటి వరకు ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోయి.. అన్ని పనుల్లో విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు.
కన్య రాశి: ఈరాశికి అధిపతి బుధుడు.. ఈ రాశి వారు ఆంజనేయస్వామికి అభిషేకం.. ఆకుపూజ నిర్వహించాలి. ఆ తరువాత స్వామికి పానకం.. తులసి ఆకులు సమర్పించాలి.ఇలా చేయడం వలన ఆర్థికంగా అభివృద్ది చెందడంతోపాటు.. ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయని పండితులు చెబుతున్నారు.
తుల రాశి: ఈరాశికి అధిపతి కూడా అధిపతి శుక్రుడే.. ఈ రాశి వారు హనుమజ్జయంతి రోజు స్వామి వారికి సింధూరం సమర్పించి తమలపాకులతో పూజ అనంతరం స్వీట్లు, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించడం వలన వలన హనుమంతుడి కటాక్షం పుష్కలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోభివృద్ధి సాధిస్తారు. చేపట్టిన అన్ని పనులు హనుమంతుడి దయతో సఫలమవుతాయి. ఈ రాశి వారి ఆర్థిక దృక్పథం చాలా బలంగా ఉండి జీవితంలో ఎప్పుడు డబ్బుకు లోటు లేకుండా ఉంటారు.
వృశ్చిక రాశి: ఈరాశికి అధిపతి కుజుడు. హనుమజ్జయంతి రోజున ఈ రాశి వారు హనుమంతుడిని పూజించి.. సుందరాకాండ పారాయణం చేసి.. స్వామికి అప్పాలు, శనగపిండి లడ్డూలు, తేనె నైవేద్యంగా సమర్పించాలి. అలా చేయడం వలన రాశి జాతకులకు శుభప్రదంగా ఉండటమే కాకుండా ..ధనం కొదువ లేకుండా హనుమంతుడు చూస్తాడని పండితులు చెబుతున్నారు
►ALSO READ | వ్యర్థాలను కళాఖండాలుగా మార్చిన ప్లాస్టిక్ వాలా..యంగ్ ఆర్టిస్ట్ స్కాలర్‌షిప్ ఇన్ పెయింటింగ్ పురస్కారం
ధనుస్సు రాశి: బృహస్పతి ఈరాశికి అధిపతి. రామభక్త హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో 108 ప్రదక్షిణాలు చేయాలి. ఆ తరువాత స్వామికి పాయసం,శనగలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహం పొందుతారని పండితులు అంటున్నారు.ఆంజనేయస్వామి ఆశీస్సులతో ఈరాశి వారు ఇప్పటి వరకు పడుతున్న ఇబ్బందులు తొలగి.. సమస్యలు పరిష్కారం అవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
మకర రాశి: ఈరాశికి అధిపతి శని.. హనుమత్ జయంతి రోజున ఈ రాశి వారు దేవాలయంలో దీపారాధనకు ఒక ఇనుప ( స్టీలు) పాత్రలో నిండుగా నూనెను పోసి సమర్పించాలి. శక్తికి తగిన విధంగా ఇవ్వాలి, ఆ తరువాత ఆంజనేయ స్వామికి షోడశోపచార పూజలు నిర్వహించి లడ్దూలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వలన జీవితంలో అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.
కుంభ రాశి: శని ఈరాశికి అధిపతి . ఈ రాశి వారు హనుమజ్జయంతి రోజున స్వామికి ఆకుపూజ చేసి.. హనుమాన్ చాలీసా 11 సార్లు చదివిన తరువాత నల్ల శనగలు, బెల్లం లడ్డూలు సమర్పించాలి. స్వామికి వడమాలను సమర్పించాలి. ఇలా చేయడం వలన ఈ రాశి వారు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. సమస్యలు వచ్చినప్పటికీ వాటిని పరిష్కరించుకునే శక్తి హనుమంతుడు మీకు ఇస్తారు. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. మంగళవారం రోజే హనుమజ్జయంతి కావడం వలన ఆంజనేయ దండకం చదవడం వల్ల శ్రేయస్సు, సంతోషం కలుగుతాయి.
మీన రాశి: బృహస్పతి ఈరాశికి అధిపతి. హనుమాన్ జయంతి రోజున ఈ రాశి వారు సింధూరంతో పూజించాలి. అరటి పండ్లు, శనగలు, జిలేబీ వంటి తీపి పదార్థాలను స్వామివారికి సమర్పించాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్న ప్రతికూల శక్తులు తొలగి... మీరు ప్రతి పనిలోనూ ఆంజనేయస్వామి అనుగ్రహం వల్ల విజయం .. పురోగతిని పొందుతారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని సమాచారం పురాణాల ప్రకారం ఆధ్యాత్మిక నిపుణులు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
