నగుమోము..సాంగ్‌‌ రిలీజ్

నగుమోము..సాంగ్‌‌ రిలీజ్

యశ్ పూరీ, అపూర్వ రావు జంటగా రూపొం దుతున్న చిత్రం ‘హ్యాపీ ఎండింగ్’. కౌశిక్ భీమిడి దర్శకత్వంలో హామ్స్ టెక్  ఫిల్మ్స్,  సిల్లీ మాంక్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. శుక్రవారం ఈ మూవీ నుంచి  ‘నగుమోము’ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. నిడమర్తి రవి కంపోజ్ చేసిన ఈ పాటకు లక్ష్మీ ప్రియాంక క్యాచీ లిరిక్స్ రాయగా, కృష్ణ తేజస్వి పాడింది.  

‘నగుమోము కనగానే నాలోన మెరుపే మెరిసే విరిసే..’ అంటూ ప్లెజంట్ కంపోజిషన్‌‌తో పాట సాగింది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్‌‌కి ప్లాన్ చేస్తున్నారు.