
న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెకండ్ వన్డేలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అదిరిపోయే క్యాచ్ అందుకున్నాడు. బౌలింగ్ రనప్‌లో బ్యాట్స్మన్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను సింగిల్ హ్యాండ్‌తో ఒడిసిపట్టాడు. చాలా కిందకు వచ్చిన బంతిని రెప్పపాటులో అందుకుని ఆశ్చర్యపరిచాడు. ఈ ప్రస్తుతం ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సందర్భంగా 10వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా..నాలుగో బంతిని కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే స్ట్రైట్గా ఆడాడు. బౌలింగ్ రనప్‌లోనే ఉన్న హార్దిక్ పాండ్యా తన లెఫ్టాండ్‌తో బంతిని అద్భుతంగా అందుకున్నాడు. దీంతో బిత్తరపోయిన కాన్వే నిరాశగా పెవీలియన్ చేరాడు.