- రాష్ట్రంలో బుల్డోజర్ సర్కార్ నడుస్తున్నది
- మైనార్టీలను కాంగ్రెస్ దగా చేస్తున్నది
- దయనీయంగా బస్తీ దవాఖానాలు
- ఇఫ్తార్ విందులో హరీశ్‌రావు
గచ్చిబౌలి, వెలుగు: రాష్ట్రంలో బుల్డోజర్సర్కార్పనిచేస్తున్నదని, సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ చోటా యోగిగా మారాడని మాజీ మంత్రిహరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలను దగా చేస్తోందని దుయ్యబట్టారు. హైదరాబాద్ కొండాపూర్ లోని మార్తాండనగర్ బడాగుండులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో హరీశ్ రావు చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సెక్యూలర్ పార్టీ అని, దేశంలోనే మొదటిసారిగా ఇమామ్‌లకు జీతం ఇచ్చిన సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు.
కేసీఆర్ పాలనలో ముస్లింలకు రంజాన్ తోఫా అందించేవారని, కానీ రేవంత్ రెడ్డి రాగానే జిల్లాల్లో ఆ పథకాన్ని బంద్ చేశారని పేర్కొన్నారు. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయన్న స్వార్థంతోనే ఇప్పుడు హైదరాబాద్‌లో నామమాత్రంగా తోఫా పంచుతున్నారని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చీకటి పొత్తులు పెట్టుకుని ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులను పంచుకున్నాయని ఆరోపించారు. బీజేపీతో బీఆర్ఎస్ఏనాడూ పొత్తు పెట్టుకోదని వెల్లడించారు.
లక్ష ఇండ్లను కూలగొట్టారని ఫైర్
బీఆర్ఎస్హయాంలో మైనార్టీల కోసం రూ.2500 కోట్లు బడ్జెట్ ఖర్చు చేస్తే, కాంగ్రెస్ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం రూ.4 వేల కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు వెయ్యి కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. కొండాపూర్జిల్లా ఆస్పత్రిలో 200 పడకలతో ఆక్సిజన్ సౌకర్యం కల్పించామని, హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి బస్తీ ప్రజలకు డాక్టర్లను, మందులను అందుబాటులో ఉంచామని తెలిపారు.
కానీ కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానాల్లో కనీసం మందులు కూడా లేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందన్నారు. హైదరాబాద్‌లో పేదల కోసం కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టకపోగా, హైడ్రా పేరుతో లక్ష ఇండ్లను కూలగొట్టారని ఫైర్అయ్యారు. ఉత్తరప్రదేశ్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ల ప్రభుత్వ పాలన సాగిస్తుంటే.. రేవంత్ రెడ్డి తెలంగాణకు చోటా యోగిగా తయారయ్యారని ఎద్దేవా చేశారు.
