ఆన్ లైన్ లో పాఠాలు‌ చెప్పడం ఓ చాలెంజ్

ఆన్ లైన్ లో పాఠాలు‌ చెప్పడం ఓ చాలెంజ్

లాక్ డౌన్ లో ప్రభుత్వ టీచర్లు ఆన్ లైన్ క్లాసులు చెప్పడం ఓ చాలెంజ్ అని అన్నారు మంత్రి హరీశ్ రావు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ టీచింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టీచర్లకు హరీశ్ సర్టిఫికెట్స్ అందజేసి వారిని అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్.. ప్రైవేటు విద్యార్థులకు ఫోన్లపై కొంత అవగాహన ఉంటుంది.. కాని పేద విద్యార్థులకు ఆన్ లైన్ లో నేర్చుకోవడం కత్తి మీద సాము లాంటి దన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ టీచర్లు ఆన్ లైన్ లో పాఠాలు‌ చెప్పడం ఓ చాలెంజ్ అన్నారు. టీచర్లు కూడా విద్యార్థులుగా మారి నేర్చుకుని, విద్యార్థులకు నేర్పుతున్నారన్నారు. దీని వల్ల  దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతోందన్నారు. అలా విద్య నేర్పే టీచర్లు కీలకమైన వ్యక్తులన్నారు. విద్య ఉద్యోగం కోసం కాదని.. విలువలు, సామాజిక సృహ , రాజ్యాంగం పట్ల విధేయత నేర్పే దే విద్య అని అన్నారు.  స్కూల్స్ ప్రారంభమైనా ఈ ఆన్ లైన్ బోధనా పద్ధతిని కొనసాగించాలన్నారు.

పక్షుల సేఫ్టీ కోసం ఈ కైట్స్ ను వాడండి