దత్తన్న అలయ్ బలయ్..హాజరైన ప్రముఖులు

V6 Velugu Posted on Oct 17, 2021

హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో బండారు దతాత్రేయ  కూతురు విజయలక్ష్మి  ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మా అధ్యక్షుడు విష్ణు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హర్యానా గవర్నర్ బండారు దత్రాత్రేయ వీరికి వెలకమ్ చెప్పారు. అలయ్ బలయ్ కార్యక్రమం తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతోందన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. కార్యక్రమానికి వచ్చిన ఆమె కళాకారులతో కలిసి కోలాటమాడారు. అలాగే డోలు వాయించారు.  2005లో అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు దత్తాత్రేయ. తెలంగాణకు ప్రత్యేకమైన వెజ్,నాన్ వెంజ్ వంటకాలతో పాటు మొత్తం 40 వెరైటీస్  చేశారు. కరోనా కారణంగా  నమస్కారాలతో అలయ్ బలయ్ జరిపారు.

అలయ్ బలయ్ నిర్వహిస్తున్నందుకు అభినందిస్తూ దత్తాత్రేయకు లేఖ రాశారు ప్రధాని మోడీ. అలయ్ బలయ్ కార్యక్రమం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తోందని లేఖలో పేర్కొన్నారు. కేంద్రం అమలు చేస్తోన్న ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్ లక్ష్యం కూడా ఇదేనన్నారు.

 

Tagged celebrations, Venkaiah Naidu, alai balai, jalavihar, Haryana Governor Bandaru Dattatreya , #PawanKalyan

Latest Videos

Subscribe Now

More News