నవంబర్ 13లోపు హెచ్సీఏ ఎన్నికలు నిర్వహించాలె : వినోద్

నవంబర్ 13లోపు హెచ్సీఏ ఎన్నికలు నిర్వహించాలె : వినోద్

హెచ్సీఏ ఎన్నికలను నవంబర్ 13లోపు నిర్వహించాలని హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు గడ్డం వినోద్ డిమాండ్ చేశారు. ఉప్పల్ స్టేడియంలో క్లబ్ సెక్రటరీలు, హెచ్సీఏ మాజీ అధ్యక్షులు, మాజీ కార్యదర్శులు, ఆఫీస్ బేరర్స్తో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన హెచ్సీఏ పర్యవేక్షణ కమిటీ సమావేశమైంది. హెచ్సీఏ ఎన్నికల అంశాన్ని పర్యవేక్షణ కమిటీ దృష్టికి తీసుకెళ్లామని వినోద్ చెప్పారు. 

ఇప్పుడు కొనసాగుతున్నహెచ్సీఏ కమిటీ గడువు సెప్టెంబర్ 3న ముగిసిందని.. ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి హెచ్సీఏ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని కమిటీని కోరినట్లు తెలిపారు. కొత్త కమిటీ ఏర్పడ్డాక సమస్యలు తొలగిపోతాయనే నమ్మకం తమకుందన్నారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన హెచ్సీఏ పర్యవేక్షణ కమిటీపై తమకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు.