శిఖర్ ధవన్‌ ఓ ఇడియట్‌..

శిఖర్ ధవన్‌ ఓ ఇడియట్‌..

న్యూఢిల్లీ: తన ఓపెనింగ్‌‌ పార్టనర్‌‌ శిఖర్‌‌ ధవన్‌‌ ఓ ఇడియట్‌‌ అని రోహిత్‌‌శర్మ అన్నాడు. ఆసీస్​ క్రికెటర్​ డేవిడ్‌‌ వార్నర్‌‌తో ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో మాట్లాడిన హిట్‌మ్యాన్​ ధవన్‌‌తో ఇన్నింగ్స్‌‌ ఓపెన్‌‌ చేయడంపై ఇలా స్పందించాడు. ‘ ధవన్‌‌ ఓ మూర్ఖుడు. ఫస్ట్‌‌ బాల్‌‌ ఫేస్‌‌ చెయ్యడానికి ఇష్టపడడు. స్పిన్‌‌ బౌలింగ్‌‌ ఆడేందుకు ఇష్టపడతాడు కానీ అటాక్‌‌ చెయ్యడానికి నచ్చడు. 2013 చాంపియన్స్‌‌ ట్రోఫీలో నేను ఫస్ట్‌‌ టైమ్‌‌ ఓపెనర్‌‌గా వచ్చా. నేనిప్పటి దాకా కొత్త బాల్‌‌ ఫేస్‌‌ చెయ్యలేదు, నువ్వు స్ట్రయిక్‌‌ తీసుకో అని శిఖర్‌‌కు చెప్పా. నువ్వు చాలా కాలంగా ఆడుతున్నావు..నాకిదే ఫస్ట్‌‌ టూర్‌‌ సో నువ్వే స్ట్రయిక్‌‌ తీసుకో అని శిఖర్‌‌ నాకు చెప్పాడు. అంటే రెగ్యులర్‌‌ ఓపెనర్‌‌ అయిన మనిషికి స్ట్రయిక్‌‌ తీసుకోవడం ఇష్టం లేదనేగా. దాంతో నేనే స్ట్రయిక్​ తీసుకున్నా. కానీ ధవన్‌‌తో ఇప్పుడు చాలా కంఫర్టబుల్​గా ఉన్నా. ఇప్పటికీ కొన్ని సార్లు చికాకు తెప్పిస్తాడు.  వికెట్ల మధ్య పరుగెత్తే విషయంలో శిఖర్‌‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. డిఫెన్స్‌‌ ఆడి వెంటనే నాన్‌‌ స్ట్రయికర్‌‌ ఎండ్‌‌కు పరుగెడతాడు. రన్‌‌కు వెళ్లాలో లేదో నాకు అర్థం కాదు. అందుకే బాల్‌‌ గ్యాప్‌‌లోకి వెళ్తే కానీ రన్‌‌ చేయకూడదని డిసైడయ్యా. ఈ క్రమంలో చాలా రన్స్‌‌ మిస్‌‌ చేశా. కానీ ఎప్పుడూ  బాధపడలేదు’ అని రోహిత్‌‌ చెప్పాడు. ధవన్‌‌ సన్‌‌రైజర్స్‌‌కు ఆడేటప్పుడు తనకూ అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని వార్నర్‌‌ కూడా చెప్పడం కొసమెరుపు. 2009 ఐపీఎల్‌‌లో డెక్కన్‌‌ చార్జర్స్‌‌కు ఆడిన రోహిత్‌‌.. ముంబై ఇండియన్స్‌‌పై హ్యాట్రిక్‌‌ వికెట్లు సాధించాడు.  అయితే, ఆ హ్యాట్రిక్‌‌ ఎలా సాధించానో ఇప్పటికీ అర్థం కావడం లేదని రోహిత్‌‌  చెప్పాడు. ‘ముంబైపై హ్యాట్రిక్‌‌ తీశానంటే  ఇంకా నమ్మలేకపోతున్నా. అప్పుడెలా బౌలింగ్‌‌ చేశానో కూడా గుర్తు లేదు’ అన్నాడు.