
ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా జనవరి-11న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మూవీ యూనిట్ ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. ఒక్కో సాంగ్ టీజర్, పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఆదివారం మూవీ రిలీజ్ డేట్, ఫ్రీ రిలీజ్ తేదీలను అనౌన్స్ చేస్తూ పోస్టర్లను విడుదల చేసిన యూనిట్..సోమవారం ఓ సాంగ్ ను వదిలింది.
‘హి ఈజ్ సో క్యూట్..హి ఈజ్ సో స్వీట్..హి ఈజ్ సో హ్యాండ్సమ్, హి ఈజ్ సో హాట్’ అంటూ హీరోయిన్ రష్మిక మహేశ్ బాబును ఫాలో అవుతూ పాడే పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శ్రీమణి రాసిన ఈ పాటను మధుప్రియ పాడింది. మహేష్ బాబును పొగడుతూ రష్మిక చేసిన అల్లరి సూపర్భ్ అంటున్నారు. పాటలో ప్రిన్స్, రష్మికల కెమిస్టీ బాగా వర్కవుట్ అయ్యిందంటున్నారు ఫ్యాన్స్. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Here’s the groovy & peppy song #HeIsSoCute from #SarileruNeekevvaru ✨
I hope you guys enjoy it ⚡️https://t.co/fdbJPRpbec@urstrulyMahesh @AnilSunkara1 @ThisIsDSP @RathnaveluDop @AKentsOfficial @GMBents @SVC_official @LahariMusic— Rashmika Mandanna (@iamRashmika) December 16, 2019