యూకేలో వ్యక్తి తల నరికేందుకు సూడాన్ దేశస్తుడి యత్నం

యూకేలో వ్యక్తి తల నరికేందుకు సూడాన్ దేశస్తుడి యత్నం
  • నార్త్ ఐర్లాండ్ లో వలసదారులకు వ్యతిరేకంగా చెలరేగిన ఘర్షణలు

లండన్: ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్ఫాస్ట్‌‌లో వలసదారులకు వ్యతిరేకంగా భారీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఓ సూడాన్ వలసదారుడు స్థానిక వ్యక్తిపై కత్తితో దాడి చేసి, తల నరికేందుకు ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వందలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. 

సోమవారం రాత్రి ఉత్తర బెల్ఫాస్ట్‌‌లో 30 ఏళ్ల సూడాన్ దేశస్తుడు 40 ఏళ్ల వ్యక్తిపై కత్తితో దాడి చేయగా, అక్కడున్నవారు రక్షించి ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత ముసుగులు ధరించిన నిరసనకారులు పలు ప్రాంతాల్లో కొన్ని ఇళ్లకు, వాహనాలకు నిప్పు పెట్టారు. 

పోలీసులపై పెట్రోల్ బాంబులు విసిరారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇది అసహ్యకరమైన ఘటన అని వ్యాఖ్యానించారు. కొందరు కావాలనే  విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు.