- రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ను ట్రాప్ చేసిన సైబర్ క్రిమినల్
ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా అయినట్టు ఫేక్ మెసేజ్ పంపి రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ నుంచి సైబర్ క్రిమినల్ రూ.75 వేలు కొట్టేశాడు. హిమాయత్‌నగర్ లో ఉండే రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ మొబైల్‌కి సోమవారం హఫీజ్‌పేటలోని ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. అది ఫేక్ అని తెలియక ఆయన అందులోని కస్టమర్ కేర్ నంబర్‌కి కాల్ చేశాడు. తాను ఇంట్లోనే ఉన్నా, అకౌంట్ నుంచి క్యాష్ డ్రా అయిందని చెప్పాడు. డెబిట్ కార్డ్ సీరియల్, సీవీవీ, పిన్ నంబర్స్ చెప్తే ఏం జరిగిందో చూసి, చెప్తామని అవతలి వ్యక్తి తెలిపాడు. అలా డీటెయిల్స్ తీసుకుని రూ.75 వేలు ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడు. బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.

