
హైదరాబాద్: తల్లిదండ్రులు లేని పిల్లలంతా ప్రభుత్వ బిడ్డలేనని మంత్రి సీతక్క అన్నారు. తల్లిదండ్రులు లేని లోటును తీర్చి వాళ్ళు ఎదిగే విధంగా ప్రభుత్వం మానసిక ధైర్యా న్ని కల్పిస్తుందని స్పష్టం చేశారు. శిశువిహార్ సంరక్షణలో ఉన్న అనాధ చిన్నారులకు మరో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఆరోగ్యశ్రీ కార్డులు అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ...వారికి హెల్త్ కార్డులు ఇవ్వడం ఒక విప్లవాత్మక నిర్ణయమన్నారు. ఈ నిర్ణయంతో కుటుంబం లేదని బాధను తీరుస్తున్నట్లు తెలిపారు. మొదటిసారిగా హైదరాబాదులో 2200 మంది అనాధలకు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులను అందజేస్తున్నా మని, దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఆసరా లేని పిల్లల్ని చేరదీయాలని, వారిని సంరక్షిస్తే నెలకు రూ.4500 ఇస్తామని ప్రకటించారు. చిన్నారులతో కలిసి మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ భోజనం చేశారు.
►ALSO READ | త్వరలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ: మంత్రి పొన్నం