
హైదరాబాద్: త్వరలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం (మే 17) జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో హైదరాబాద్ ఇన్ చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్ వీ కర్ణన్, జోనల్ కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మాన్సూన్ యాక్షన్ ప్లాన్, SNDP, పారిశుధ్యం, ఇంజనీరింగ్ నిర్వహణ, స్ట్రీట్ లైట్స్పై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. సమీక్ష సమావేశంలో హైదరాబాద్ అభివృద్ధి పనులపై చర్చించామని తెలిపారు. ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించానని చెప్పారు. వర్షాకాలంలో వచ్చే సమస్యలను తగ్గించేలా క్షేత్ర స్థాయిలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించానని తెలిపారు. నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేసి అర్హులకు అందజేస్తామని పేర్కొన్నారు.
►ALSO READ | స్వయం సహాయక సంఘాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. కోటి మందిని కోటీశ్వరులను చేస్తాం
నగరంలో స్ట్రీట్ లైట్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. మెట్రో రైల్ చార్జీల పెంపుపై మంత్రి పొన్నం స్పందించారు. వయబుల్ కాని కారణంగా మెట్రో ఛార్జీలు పెంచినట్లు సంస్థ నిర్వహకులు చెబుతున్నారు.. దానిపై ప్రభుత్వం రివ్యూ చేస్తుందని చెప్పారు. హైదరాబాద్ ఇన్చార్జి మంత్రిగా నేను కూడా ఛార్జీలు తగ్గించమని విజ్ఞప్తి చేస్తానని అన్నారు.