థర్డ్ వేవ్ వస్తుందనడానికి శాస్త్రీయ ఆధారాల్లేవ్

థర్డ్ వేవ్ వస్తుందనడానికి శాస్త్రీయ ఆధారాల్లేవ్

కరోనా థర్డ్ వేవ్ వస్తుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు. ఒకవేళ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. స్కూళ్లలో కరోనా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ధైర్యంగా స్కూళ్లకు పంపించవచ్చన్నారు శ్రీనివాస్ రావు. కేరళ వంటి పరిస్థితులు రాష్ట్రంలో లేవని స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులు వచ్చే కాలం కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.