ఆడబిడ్డల ఆరోగ్య పరీక్షలపై అలసత్వం వద్దు : మంత్రి దామోదర

ఆడబిడ్డల ఆరోగ్య పరీక్షలపై అలసత్వం వద్దు : మంత్రి దామోదర
  • వాహనాల్లో సురక్షితంగా హాస్పిటల్స్​కు తీసుకెళ్లాలి
  • ఉమెన్ వెల్​నెస్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అధికారులకు మంత్రి దామోదర ఆదేశాలు 
  • 46 లక్షల మంది డ్వాక్రా మహిళలకు 30 రకాల హెల్త్ చెకప్స్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు చెందిన 46 లక్షల మంది మహిళల కోసం ప్రభుత్వం ప్రారంభించిన ఉమెన్ వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ ప్రోగ్రామ్ లో ఎలాంటి అలసత్వం ఉండకూడదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి హెల్త్, సెర్ప్ ఉన్నతాధికారులు, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టెస్టుల కోసం గ్రామాల్లోని మహిళలను ఆసుపత్రులకు సురక్షితంగా తీసుకురావడం, పరీక్షలు పూర్తయ్యాక తిరిగి ఇంటి వద్ద దించేందుకు సెర్ప్ అధికారులు వెహికల్స్​ఏర్పాటు చేయాలని సూచించారు.

ఒకేసారి ఎక్కువ మందిని తీసుకురాకుండా, బ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వారీగా తీసుకురావాలని తెలిపారు. ఆసుపత్రుల్లో కూర్చీలు, తాగునీరు, సరిపడా సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్లడ్ శాంపిల్స్ పాడవకుండా కోల్డ్ చైన్ విధానాన్ని కచ్చితంగా పాటించాలని, ల్యాబ్ డేటా ఎంట్రీలో ఎలాంటి తప్పులు దొర్లొద్దని హెచ్చరించారు. డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలు ఫీల్డ్ స్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ మీటింగ్​లో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, కమిషనర్ సంగీత సత్యనారాయణ, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.

46 లక్షల మహిళలకు 30 రకాల పరీక్షలు..

ఉమెన్ వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్ ద్వారా రాష్ట్రంలోని ఎస్​హెచ్​జీలకు చెందిన 46 లక్షల మంది మహిళలకు బీపీ, షుగర్, థైరాయిడ్, కిడ్నీ, కాలేయం పనితీరు వంటి మొత్తం 30 రకాల పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్ట్​ఫేజ్​లో ప్రతి జిల్లాలో ఐదు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. సెర్ప్ ఆధ్వర్యంలో మహిళలను పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలకు తీసుకువచ్చి బ్లడ్ శాంపిల్స్ సేకరించి, వాటిని టీ-డయాగ్నస్టిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపిస్తారు. స్క్రీనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎవరికైనా రోగాలు ఉన్నట్లు తేలితే ఆలస్యం చేయకుండా చికిత్స ప్రారంభిస్తారు. కాగితాలతో పనిలేకుండా ప్రతి మహిళకు ఆభా ఐడీ ద్వారా క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో డిజిటల్ హెల్త్ రికార్డులు క్రియేట్ చేస్తారు. టెస్ట్ రిపోర్టును మహిళల మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఈ–-ఆరోగ్యం యాప్ ద్వారా పంపిస్తారు.