
కొంతమంది జలుబు చేసినప్పుడు ఆవిరి పట్టుకునేందుకు గిన్నెలో వేడినీళ్లు పోసి నానా తంటాలు పడుతుంటారు. కానీ.. ఈ స్టీమర్‌తో ఈజీగా ఆవిరి పట్టుకోవచ్చు. ఇందులో కొన్ని నీళ్లు పోసి కరెంట్‌కి ప్లగ్ పెట్టి, ఆన్ చేస్తే చాలు స్టీమ్ బయటికి వస్తుంది. దీన్ని హెల్త్ సెన్స్ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఈ స్టీమర్- నానో–అయానిక్ స్టీమ్‌ని ఇస్తుంది. ఇది సాధారణ ఆవిరితో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా చర్మంలోకి చొచ్చుకుపోతుంది.
జలుబు, దగ్గు లాంటివాటిని తగ్గించడానికే కాదు.. ఫేస్ స్టీమ్, ఇన్హాలేషన్ థెరపీ, వేపరైజేషన్ లాంటివాటికి కూడా బాగా పనికొస్తుంది. చర్మాన్ని రిజువెనేట్ చేస్తుంది. ఇందులో యూవీ స్టీమ్ స్టెరిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. అందుకే దీనిలో నుంచి బయటికి వచ్చే ఆవిరిలో సూక్ష్మక్రిములు, హానికరమైన వ్యాధికారకాలు ఉండవు. దీనికి 100 ఎంఎల్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఒకసారి నీళ్లు నింపితే పదిహేను నిమిషాల వరకు పనిచేస్తుంది.