వడగాడ్పులు కూడా విపత్తే..వాటినీ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ పరిధిలోకి తేవాలె: మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్

వడగాడ్పులు కూడా విపత్తే..వాటినీ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ పరిధిలోకి తేవాలె: మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్

హైదరాబాద్​, వెలుగు: పర్యావరణ పోరాటం ప్రజల ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్​ అన్నారు. ఢిల్లీలో కేంద్రం రూపొందించే విధానాలకు.. క్షేత్ర స్థాయిలోని తెలంగాణకు చెందిన రైతుకుగానీ, కర్నాటకలోని విద్యార్థికిగానీ మధ్య విపరీతమైన అగాథం ఉంటున్నదని, ఆ విధానాలు కిందిస్థాయి వారికి చేరడం లేదని పేర్కొన్నారు. ఆ మిస్సింగ్​ మిడిల్ ఇప్పుడు అతిపెద్ద సవాల్​ అని ఆయన అభిప్రాయపడ్డారు.

గురువారం ఐఐఎం బెంగళూరు నిర్వహించిన ‘క్లైమేట్​ ఇన్నొవేషన్​ సమిట్​ 2026’ ప్యానెల్​ డిస్కషన్​లో ఆయన మాట్లాడారు. దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఏప్రిల్​లో చాలా వరకు నగరాల్లో టెంపరేచర్లు 46 డిగ్రీలు దాటాయని గుర్తు చేశారు. వరదలు, భూకంపాల కంటే కూడా వడగాల్పుల వల్లే ఎక్కువ ప్రాణనష్టం జరుగుతున్నదని, అయినా కూడా ఎస్​డీఆర్​ఎఫ్​, ఎన్డీఆర్​ఎఫ్​ పరిధిలో వడగాడ్పులను విపత్తుగా గుర్తించకపోవడం ప్రభుత్వాల వైఫల్యమన్నారు. రాబోయే విపత్తు నిర్వహణ మీటింగుల్లో దీనిపై కేంద్రాన్ని రాష్ట్రాలు ఒత్తిడి చేయాలని ఆయన కోరారు. దేశంలోని ప్రతి కాలేజీ క్యాంపస్​ను ఒక 'క్లైమేట్ గవర్నెన్స్ యూనిట్'గా మార్చాలని పిలుపునిచ్చారు.