భద్రాచలం, వెలుగు: భద్రాద్రి రాముడి సన్నిధి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అర్చకులు సుప్రభాత సేవ అనంతరం గర్భగుడిలో మూలవరులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. భక్తులకు అభిషేక జలాలు, మంజీరాలను పంపిణీ చేశారు. తర్వాత బంగారు పుష్పాలతో అర్చన చేసి విశేష హారతులు సమర్పించారు.
భక్తులతో ఉచిత దర్శనం క్యూలైన్లతో పాటు, సుదర్శన ద్వారం క్యూలైన్లు నిండిపోయాయి. కల్యాణమూర్తులకు బేడా మండపంలో నిత్య కల్యాణం నిర్వహించారు. భక్తులకు కోసం ఈవో దామోదర్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో చల్లనినీరు, మజ్జిగను అందజేశారు.
