12 రాష్ట్రాలకు వడగాలుల హెచ్చరిక

12 రాష్ట్రాలకు వడగాలుల హెచ్చరిక

దేశవ్యాప్తంగా ఎండలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే టెంపరేచర్లు 40 డిగ్రీలు దాటాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎండ తీవ్రతకు జనం బయటకు రావడానికే భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. 12 రాష్ట్రాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఐదు రోజుల పాటు వడగాలులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలో వడగాలులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ చెప్పింది. మహారాష్ట్రలో ఇవాళ, రేపు వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గుజరాత్, ఛత్తీస్‌గఢ్,  జార్ఖండ్, బీహార్‌‌లో కూడా వేడి గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది.

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు

మరోవైపు ఈశాన్య రాష్ట్రాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న ఐదు రోజుల్లో ఈశాన్యంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.

మరిన్ని వార్తల కోసం..

ఎంఐఎం కార్పొరేటర్పై ఎఫ్ఐఆర్

కచ్చాబాదం సాంగ్కు డ్యాన్స్ చేసిన మాధురీ స్టెప్స్