ఎంఐఎం కార్పొరేటర్పై ఎఫ్ఐఆర్

ఎంఐఎం కార్పొరేటర్పై ఎఫ్ఐఆర్

హైదరాబాద్: విధుల్లో ఉన్న పోలీసులపై మజ్లిస్ కార్పొరేటర్ దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది. తెల్లవారుజాము వరకు తెరిచి ఉన్న షాపులు, హోటళ్లను మూయించేందుకు వెళ్లిన పోలీసులను భోలక్ పూర్ కార్పొరేటర్ మమ్మద్ గౌసుద్దీన్ అడ్డుకున్నారు. రంజాన్ మాసం ముగిసే వరకు రాత్రి పూట కూడా హోటళ్లు, షాపులు తెరిచే ఉంటాయని కార్పొరేటర్ చెప్పారు. అయితే, తమకు పైనుంచి ఆదేశాలు అందాయని.. సమయానికి హోటళ్లను మూసేయాలని పోలీసులు చెప్పబోగా.. ‘మీరు వంద రూపాయలకు పనిచేసే మనుషులు’ అంటూ కార్పొరేటర్ గౌసుద్దీన్ నోరు పారేసుకున్నారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడిని వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కేటీఆర్ ఆదేశించారు. 

కేటీఆర్ ట్వీట్ తో నిందితులపై పోలీసులు FIR ఫైల్ చేశారు. మంత్రి ఆదేశాలతో నిందితుడిపై పోలీసులు ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే టీఆర్ఎస్ పాలనలో ఎంఐఎంకు ఓ రూల్.. మిగతావారికి మరో రూల్ నడుస్తోందని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ అయ్యారు. భోలక్ పూర్ ఘటనపై స్పందించిన ఆయన.. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం కార్పొరేటర్ పై పోలీసులు చర్యలు తీసుకోకపోతే, బీజేపీ నేతలకు అవకాశం ఇస్తే.. తగిన బుద్ధి చెబుతామన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

దేశ యువతను కుటుంబ పార్టీలు ఎదగనిస్తలే

దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీనే

కచ్చాబాదం సాంగ్కు డ్యాన్స్ చేసిన మాధురీ స్టెప్స్