తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం..

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం..

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం భీభత్సం సృష్టిస్తుంది. పలు జిల్లాలో అర్ధరాత్రి నుంచి వడగండ్ల వాన కురుస్తుంది. వేల ఎకరాల్లో వరి దెబ్బతింటోంది. నిజామాబాద్ జిల్లాలోని  దర్పల్లి, మాక్లూరు, నందిపేట, డొంకేశ్వర్, మోపాల్, ఆలూరు, రెంజల్, ఆర్మూర్ మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది. జిల్లా వ్యాప్తంగా 10 ట్రాన్స్ ఫార్మర్లు, 150 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల కరెంట్ సరఫరాకు అంతరాయి ఏర్పడింది.

 విద్యుత్ శాఖకు 50 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. నందిపేట మండలం ఖుద్వాన్ పూర్ లో పిడుగు పాటుకు మూడు గేదెలు మృతి చెందాయి. పలు చెట్లు కుప్పకూలాయి.

మరోవైపు, మెదక్ జిల్లానూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రామాయంపేట, నిజాంపేట మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది. గాలి వాన కురుస్తండటంతో విద్యుత్ కు  అంతరాయం ఏర్పడింది.

జగిత్యాల జిల్లాలో  కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది.  కోరుట్లలో తెల్లవారుజామున నుంచి భారీ వర్షం పడుతుంది. వర్షం కారణంగా వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.