హైదరాబాద్లో వర్షం.. ఈ ఏరియాల్లో దంచికొడుతోంది.. వాహనదారులు జాగ్రత్త !

హైదరాబాద్లో వర్షం.. ఈ ఏరియాల్లో దంచికొడుతోంది.. వాహనదారులు జాగ్రత్త !

హైదరాబాద్ లో వర్షం మొదలైంది. శనివారం (ఆగస్టు 09) సాయంత్రం వరకు పొడివాతావరణం కనిపించినప్పటికీ.. సాయంత్రం చల్లబడింది. 8.30 తర్వాత అక్కడక్కడ జల్లులు మొదలయ్యాయి. 9.30 తర్వాత పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

ఎల్బీనగర్,  దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, కోటి, అబిడ్స్, లక్డికపుల్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండ, షేక్ పేట్, కూకట్పల్లి, ఖైరతాబాద్, మియాపూర్, సికింద్రాబాద్, ఉప్పల్, బాలాపూర్, మీర్ పేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి రోడ్ల పై వరద నీరు చేరడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. 

సిటీ శివారు ప్రాంతంలోని రాజేంద్రనగర్, మైలార్ దేవ్ పల్లి, అత్తాపూర్, శివరాంపల్లి, బండ్లగూడ జాగర్, కిస్మత్పూర్, హైదర్ షాకోట్, హిమాయత్ సాగర్, నార్సింగి,  మణికొండ, పుప్పాలగూడ కోకాపేట్, గండిపేట్  తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది.  దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

భారీ వర్షం పడుతుండడంతో రోడ్లపై వరద నీరు భారీగా చేరుతోంది. ద్విచక్ర వాహనాలు మెట్రో స్టేషన్లు, బ్రిడ్జీలు, షటర్ల కింద తలదాచుకుంటున్నారు. వర్షం కారణంగా వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నీరు జామ్ అవ్వకుండా హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వర్షం వస్తుండటంతో మ్యాన్ హోల్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందని.. వాన తగ్గిన తర్వాత వాహనదారులు బయల్దేరాలని సూచించారు. 

అంతకు ముందు 8 గంటల తర్వాత అక్కడక్కడ కొన్ని ఏరియాల్లో వర్షం కురిసింది. మీర్ పేట్, బాలాపూర్, బడంగ్ పేట్ పరిసర ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో కూడా వానగ గట్టిగానే కొట్టింది. 

ఇటు ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాలలో కురుస్తున్న వర్షం కురుస్తోంది. సీతాఫల్ మండి, బౌద్ధ నగర్, మెట్టు గూడ, మోండా మార్కెట్, మారేడ్ పల్లి, రానిగంజ్,  బేగపేట,  బోయిన్ పల్లి తోపాటు తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. 

మధ్యరాత్రి వరకు వర్ష సూచన.. ఎక్కడోళ్లు అక్కడ ఉండటం బెటర్:

హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే మధ్య రాత్రి వరకు కూడా వానలు విడువకుండా పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ కింది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

 1. కామారెడ్డి, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట వికారాబాద్, జిల్లాలలో తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీ కంటే తక్కువ (గాలులలో) తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం వుందని చెప్పారు. 

2. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలలో ఆరెంజ్ అలెర్ట్ జారి చేశారు. తదుపరి 2-3 గంటల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 41.-61 కి.మీ.ల మధ్య గరిష్ట ఉపరితల గాలి వేగంతో (గాలులు వీచే) మోస్తరు ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం వుందని చెప్పారు. దీంతో రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదని అధికారులు సూచించారు.