హైదరాబాద్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం

హైదరాబాద్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది.  2023 సెప్టెంబర్ 3 తెల్లవారుజామున మొదలైన వర్షం బీభత్సంగా పడుతుంది.  జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, బంజారాహిల్స్, అమీర్ పేట్, హైటెక్ సిటీ , మాల్కజ్ గిరి  తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతోంది.  

దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో వాహనాలుదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.  భారీ వర్షానికి విత్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.  రానున్న మరో నాలుగు  రోజులపాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. 

 21 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది.  ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు పలు జిల్లాలో కూడా భారీ వర్షం పడుతోంది.