హైదరాబాద్ లో దంచికొడుతోన్న వర్షం.. వాహనదారులు జాగ్రత్త

హైదరాబాద్ లో దంచికొడుతోన్న వర్షం.. వాహనదారులు  జాగ్రత్త

హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, హైటెక్ సిటీ, కొండాపూర్, లింగంపల్లి, కూకట్ పల్లి, ఎర్రగడ్డ,సనత్ నగర్, అమీర్ పేటర్,పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింంద్రాబాద్,  మొహదీపట్నం కురిసింది.అల్వాల్, బోయిన్ పల్లి, బాలానగర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరింది.  ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో  వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, మల్లంపేట్, బౌరంపేట్, బహదూర్ పల్లి, సూరారం, చింతల్, జీడిమెట్ల , షాపూర్ నగర్, గాజులరామారంలో  వాన పడుతోంది.  ఉప్పల్ ఏరియాలో భారీ వర్షం కురుస్తోంది. ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ ప్రాంతాలలో ఉన్నట్లుండి వాన ఊపందుకుంది. అదే విధంగా తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ ఏరియాల్లో కూడా వర్షం కురుస్తోంది.  సికింద్రాబాద్ ప్రాంతంలో కూడా వర్షం ప్రారంభమైంది. సికింద్రాబాద్, పరేడ్ గ్రౌండ్స్ ఏరియాల్లో వర్షం కురుస్తుండటంతో ట్రాఫిక్ జాం అయ్యింది. 

►ALSO READ | గణేష్ నిమజ్జనాలు షురూ..ట్యాంక్ బండ్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు

అటు తెలంగాణ వ్యాప్తంగానూ మూడు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. జనజీవనం స్థంభించిపోయింది.