
హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనాలు షురూ అయ్యాయి. శుక్రవారం (ఆగస్టు29) ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో వినాయక నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. గణేష్ నిమజ్జనాల సందర్భంగా ఈ రోజునుంచి సెప్టెంబర్ 5 వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
నిమజ్జనానికి వచ్చే విగ్రహాలను బట్టి ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా పీవీఎన్‌ఆర్ మార్గ్‌లలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలను కవాడిగూడ మీదుగా దారి మళ్లించారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ స్టేడియం దగ్గర నిమజ్జనాల కోసం క్రేన్లను ఏర్పాటు చేశారు.
నిమజ్జనం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నిమజ్జన ఊరేగింపునకు సీసీ కెమెరాలు, డ్రోన్లు, QR కోడ్ స్కిక్కర్లతో పర్యవేక్షిస్తున్నారు.