నేడు (మార్చ్ 2) తుమ్మన్ పేటకు.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన  

నేడు (మార్చ్ 2) తుమ్మన్ పేటకు.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన  
  • గ్రామస్తులు, అభిమానులను కలవనున్న హీరో, హీరోయిన్లు  

అచ్చంపేట, వెలుగు:  విజయ్ దేవరకొండ, రష్మిక మందన సోమవారం నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూరు మండలం తుమ్మన్ పేటకు రానున్నారు. ఇటీవల రాజస్థాన్​లో వివాహం చేసుకోగా, విజయ్  దేవరకొండ స్వగ్రామమైన తుమ్మన్ పేట గ్రామంలో నిర్వహించే రిసెప్షన్ లో పాల్గొననున్నారు. విజయ్  దేవరకొండ మేనేజర్  కన్నారావు, సమీప బంధువు రామ్మోహన్ రావు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 500 నుంచి వెయ్యి మంది వీఐపీలతో పాటు 5 వేల మంది అభిమానులు హాజరుకానున్నట్లు మేనేజర్  తెలిపారు.

వీఐపీలు, అభిమానులకు వేర్వేరుగా భోజన ఏర్పాట్లు చేశామని చెప్పారు. నల్లమలలో పుట్టి పెరిగి సినీ హీరోగా ఎదిగిన విజయ్  దేవరకొండ ఈ ప్రాంత విద్యార్థులకు తనవంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చాడు. అచ్చంపేట డివిజన్ లోని 44 గవర్నమెంట్  స్కూళ్లలో 9, 10 తరగతుల్లో ఫస్ట్, సెకండ్ వచ్చిన విద్యార్థులకు రూ.10 వేలు, రూ.5 వేల చొప్పున అందించనున్నట్లు మేనేజర్  తెలిపారు.