క్యాతనపల్లి ఘటనలో బీఆర్ఎస్ లీడర్ల రిమాండ్

క్యాతనపల్లి ఘటనలో బీఆర్ఎస్ లీడర్ల రిమాండ్

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్​ చైర్​పర్సన్​ ఎన్నిక సందర్భంగా జరిగిన అల్లర్లలో రామకృష్ణాపూర్​ పోలీసులు ముగ్గురు బీఆర్ఎస్​ లీడర్లను అరెస్ట్​ చేసి రిమాండ్​కు పంపించారు. మేడిపల్లి సంపత్, బండారు సూరిబాబు, ముస్తఫాను ఆదివారం ఉదయం మంచిర్యాల మేజిస్ట్రేట్​ ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్​ విధించారు.

అనంతరం వారిని ఆదిలాబాద్​ జైలుకు తరలించారు. ఈనెల 17న క్యాతనపల్లి మున్సిపల్​ చైర్​పర్సన్, వైస్​ చైర్ పర్సన్​ ఎన్నిక సందర్భంగా ఎక్స్​అఫీషియో ఓటు వినియోగించుకునేందుకు వెళ్తున్న మంత్రి వివేక్​ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాన్వాయ్​పై బీఆర్ఎస్​ లీడర్లు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​ రాళ్లు, ట్రాఫిక్​ డివైడర్​ కోన్లతో దాడి చేశారు.