హైదరాబాద్ లో దంచిన వాన.. ఏకధాటిగా గంటన్నర పాటు వర్షం

 హైదరాబాద్ లో దంచిన వాన.. ఏకధాటిగా  గంటన్నర పాటు వర్షం

నగరంలో మంగళవారం సాయంకాలం కొన్ని  ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. గంటన్నర పాటు కురిసిన వర్షానికి రోడ్లు చెరువులను తలపించాయి. ఖైరతాబాద్, బహదూర్ పురా, మదీనా, పురానపూల్, అఫ్జల్ గంజ్, లక్డికాపూల్, కోఠి, పంజాగుట్ట, బేగంపేట ప్రాంతాల్లో వర్షం కురవగా ట్రాఫిక్​కు అంతరాయం కలిగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.