రెండు గంటల్లో భారీ వర్షం..తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక

రెండు గంటల్లో భారీ వర్షం..తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో వాతావరణ శాఖ ప్రతి మూడు గంటలకు ఒకసారి నౌకాస్ట్ బులెటిన్ విడుదల చేస్తోంది.. శుక్రవారం ( సెప్టెంబర్ 26) సాయంత్రం 5 గంటలనుంచి ఏడు గంటల మధ్య తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ అంచనా వేసింది.  

శుక్రవారం సాయంత్రం 5 గంటలనుంచి ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలలోని పలు ప్రాంతాల్లో తెలిపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 కి.మీల వేగంతో గాలులు, తేలికపాటి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. 

మరోవైపు  హైదరాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, జిల్లాలలో రానున్న రెండు మూడు గంటల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.  గంటకు 41నుంచి -61 కి.మీ.ల వేగంతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం వుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.