హైదరాబాద్ వ్యాప్తంగా దంచి కొడుతున్న వానలు.. ఏ ఏరియాలో ఎంత కురిసిందంటే..

హైదరాబాద్ వ్యాప్తంగా దంచి కొడుతున్న  వానలు.. ఏ ఏరియాలో ఎంత కురిసిందంటే..

హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం (ఆగస్టు 09) 8.30 తర్వాత మొదలైన వానలు.. నగరం అంతా వ్యాపించాయి.  పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తుండగా.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

 దాదాపు గంట నుంచి కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరద నీరు రోడ్లపై ప్రవహిస్తుండగా..  డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వరదకు లోతట్టు ప్రాంతాల్లో మోకాలు ఎత్తు నీరు చేరుకుంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవ్వటంతో  ప్రజల ఇబ్బందులకు గురవుతున్నారు. 

గంట నుంచి కురుస్తున్న వర్షానికి సిటీలో  బేగంబజార్ లో అత్యధికంగా 11.75 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. చార్మినార్ లో 10 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ 9.43, నాంపల్లి లో 9.2,  ఆసిఫ్ నగర్ లో 9.18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

హైదరాబాద్ నగర వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యినట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. మధ్యరాత్రి వరకు వర్షాలు కొనసాగనున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.