హైదరాబాద్ లో వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ లో  వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ లో వర్షం దొంచికొడుతుంది.  వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇండ్లలోకి వరద నీరు చేరటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్, కంటోన్మెంట్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, నాంపల్లి, లక్డీకపూల్, కోఠి, తార్నాక, అల్వాల్, కూకట్ పల్లి,  ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షంతో రోడ్లపై భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఎదురైతుంది. ఆఫీసులకు వెళ్లే టైంలో..భారీ వర్షం పడుతుండటంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. పంజాగుట్ట, అమీర్ పేట్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే ఒక్కోసారి ఎండపడుతూనే మళ్లీ ఒక్కసారిగా వర్షం పడుతోంది.

 

రాగల మూడు గంటల్లో సిటీ లోని చాలా ప్రాంతల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా మేడ్చల్, హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ , నారాయణపేట్, జోగులంబ, సిద్దిపేట్, భువనగిరి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలోని పలు ఏరియాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.