
- భారీ వర్షాల నేపథ్యంలో చర్యలు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే రోజువారీ సర్వీసుల్లో పలు మార్పులు చేసినట్లు తెలిపింది. కొన్ని రైళ్లను రద్దు, మరికొన్నింటిని పాక్షిక రద్దు, ఇంకొన్నింటిని రీషెడ్యూల్ చేసినట్లు పేర్కొంది. భిక్నూర్– తలమడ్ల , అక్కన్నపేట మెదక్, గజ్వేల్ -లకుడారం, బోల్సా -కర్ఖేలి రైల్వేస్టేషన్ల మధ్య ఉన్న సెక్షన్లు వరదల కారణంగా నీట మునిగాయన్నారు. జోన్ మీదుగా నడపాల్సిన రైలు సర్వీసుల్లో పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తామని తెలిపారు.
రైల్వే యాప్‌లు లేదా ఐఆర్ సీటీసీ, ఎన్టీఈఎస్ తదితర వెబ్‌సైట్ల ద్వారా రైళ్ల కు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలన్నారు. లేదంటే 139 కు డయల్ చేయాలన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు రైల్వే ఇన్స్టాగ్రామ్ (@scrailwayindia), దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్ (https://scr.indianrailways.gov.in/), సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రైళ్ల రద్దు, దారి మళ్లింపు, రీషెడ్యూల్సమాచారం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమైన స్టేషన్లలో హెల్ప్లైన్నంబర్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. కాచిగూడ 9063318082, నిజామాబాద్ 9703296714, కామారెడ్డి9281035664 , సికింద్రాబాద్ 040 – 277 86170 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.